Jackfruit Biryani Recipe | పనసకాయ బిర్యానీ ఎలా చెయ్యాలి?
Jackfruit Biryani Recipe | పనసకాయ బిర్యానీ తయారీకి ఏం కావాలి?
లేత పనసకాయ ముక్కలు: రెండు కప్పులు, బాస్మతి బియ్యం: రెండు కప్పులు, నూనె: అర కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డలు: రెండు (పెద్దవి), పచ్చిమిర్చి: నాలుగు, కొత్తిమీర, పుదీనా తరుగు: అరకప్పు చొప్పున, దాల్చినచెక్క: అంగుళం ముక్క, లవంగాలు: ఆరు, షాజీర: అర టీస్పూన్, బిర్యానీ ఆకులు: రెండు, యాలకులు: నాలుగు, మిరియాలు: పది, అనాసపువ్వు: కొద్దిగా, ధనియాల పొడి: రెండు టీస్పూన్లు, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, పసుపు: ఒక టీస్పూన్, బిర్యానీ మసాలా: ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టీ స్పూన్లు, పెరుగు: అర కప్పు, ఉప్పు: తగినంత, కుంకుమ పువ్వు: చిటికెడు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
Jackfruit Biryani Recipe | పనసకాయ బిర్యానీ ఎలా చెయ్యాలి?
పనస ముక్కల్ని ఉప్పు, పసుపు నీళ్లలో వేసి పది నిమిషాలు ఉడికించాలి. బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అరగంటపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నెపెట్టి నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు జోడించి ఎర్రగా వేయించి తీసి పక్కనపెట్టాలి. అదే నూనెలో పనసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, బిర్యానీ మసాలా వేసి సన్నని మంటపై వేయించాలి. అన్నీ బాగా వేగాక పెరుగు, కొత్తిమీర, పుదీనా తురుము వేసి మూతపెట్టి మరికాసేపు మగ్గించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆరు కప్పుల నీళ్లు పోసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, అనాసపువ్వు, షాజీర, బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి మరుగుతుండగా నానిన బియ్యం వేసి ఉడికించాలి. సగానికి పైగా ఉడికిన అన్నాన్ని నీళ్లు లేకుండా తీసి పనస ముక్కలపై పరవాలి. పైనుంచి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, నెయ్యి, కొత్తిమీర, పుదీనా తురుము, నానబెట్టిన కుంకుమపువ్వు నీళ్లతోపాటు వేసి గిన్నెను మందపాటి పెనంపై ఉంచాలి. ఐదు నిమిషాలు ఎక్కువ మంటపై, మరో పది నిమిషాలు తక్కువ మంటపై ఉడికిస్తే నోరూరించే పనసకాయ బిర్యానీ సిద్ధం.
Read More Recipes :
“Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ ఎలా వండాలి?”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

