ఉడికించిన గుడ్లు: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, టమాట: రెండు, క్యాప్సికమ్: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర:
అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, అల్లం పేస్ట్: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి: పావు టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత, వెన్న: ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్.
స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి జోడించి బాగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత తరిగిన టమాట వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. క్యాప్సికమ్, కారం, అల్లం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోయాలి. పాత్రపై మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు మగ్గించాలి. గుడ్లను ష్రెడ్డర్తో తురిమి వెయ్యాలి. చివరగా కొత్తిమీర తురుము, వెన్న, నిమ్మరసం వేసి బాగా కలిపితే నోరూరించే ఎగ్ ఖీమా మసాలా సిద్ధం.
“Egg in Onion Ring Recipe | ఆనియన్ ఎగ్ రింగ్స్ తయారీ విధానం”