మైదా పిండి: ఒక కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు, కోవా: అరకప్పు, బొంబాయి రవ్వ: ఒక టీస్పూన్, యాలకుల పొడి: అర టీస్పూన్, లవంగాలు: కొన్ని, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: కొద్దిగా.
ఒక గిన్నెలో మైదా, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లుపోసి ముద్దలా చేసుకుని.. మూతపెట్టి అరగంటపాటు పక్కన పెట్టాలి. కోవాలో రవ్వ, యాలకులపొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర వేసి కొద్దిగా నీళ్లుపోసి పాకం పట్టుకోవాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చిన్నచిన్న పూరీల్లా ఒత్తుకుని, మధ్యలో కోవా పెట్టి రెండు వైపులా మడతపెట్టి మధ్యలోకి మడిచి విడిపోకుండా లవంగం పెట్టాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక.. అప్పటికే చేసిపెట్టుకున్న వాటిని దోరగా వేయించి చక్కెరపాకంలో వేయాలి. అర నిమిషంపాటు నానిన తర్వాత తీసి విడివిడిగా పెట్టుకుంటే చాలు. లవంగ లతిక సిద్ధం.
“Aloo Manchurian Recipe | ఆలూ మంచూరియా తయారీ విధానం”