కీరా ముక్కలు: అర కప్పు, బియ్యపు పిండి: అర కప్పు, బొంబాయి రవ్వ: అర కప్పు, పెరుగు: పావు కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: అంగుళం ముక్క, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
ఒక గిన్నెలో బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లుపోసి జారుగా కలిపి పావుగంట పక్కన పెట్టుకోవాలి. కీరా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి మిశ్రమంలో ఈ కీరా మిశ్రమం కలపాలి. ఆ పిండితో పెనం మీద దోశల్లా వేసుకుంటే వేడివేడి ఫలహారం సిద్ధం.
“Banana Dosa recipe | అరటి దోశ తయారీ విధానం
“100 రకాల దోశలు సైకిల్ మీదే చిటికెలో వేసిస్తాడు.. 27 ఏళ్ల నుంచి ఇదే పని.. ఎక్కడో తెలుసా?”
“Besan Kheer Recipe | బేసన్ ఖీర్ తయారీ విధానం”