Banana Dosa recipe | అరటి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
అరటికాయ: ఒకటి, బియ్యం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: పావుకప్పు, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీస్పూన్, ఎండుమిర్చి: నాలుగు, నూనె: కొద్దిగా.
అరటి దోశ తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. అరటికాయను చెక్కుతీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ గిన్నెలో బియ్యం, అరటికాయ ముక్కలు, కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి. స్టవ్‌మీద పెనం వేడయ్యాక పిండి మిశ్రమాన్ని పలుచని దోశల్లా వేసుకుని రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే కరకరలాడే ఫలహారం సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం