Vangi bath recipe | వంగీ బాత్ తయారీ విధానం

వంగీ బాత్ తయారీకి కావలసిన పదార్థాలు
తెల్ల వంకాయలు: పావుకిలో, బియ్యం: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: పది, శనగపప్పు, మినప పప్పు, ఎండుకొబ్బరి తురుము, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, పసుపు: అర టీస్పూన్, ఇంగువ: పావు టీస్పూన్, జీడిపప్పు: పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, అల్లం తురుము: అర టీస్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర: ఒక టీస్పూన్ చొప్పున
వంగీ బాత్ తయారీ విధానం
ముందుగా వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో వేసుకోవాలి. బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ నూనెవేసి ఎండుమిర్చి, శనగపప్పు, మినప పప్పు, నువ్వులు, కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత స్టవ్‌మీద కడాయి పెట్టి నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం తురుము, ఇంగువ, జీడిపప్పు, పసుపు వేసి బాగా వేగాక తరిగిన టమాటా ముక్కల్ని వేసి వేయించాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసి తగినంత ఉప్పు చల్లి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత అన్నం, పొడి చేసుకున్న పప్పుల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే వంగీ బాత్ రెడీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Bread cake recipe | బ్రెడ్ కేక్ తయారీ విధానం
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

