
డిజిటల్ సినిమా రంగం (Digital cinema)లో పదేళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ యంగ్ మంత్ర (Young Mantra). ఇప్పటి వరకు 500లకుపైగా చిత్రాలను వారు ప్రమోట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ అనుభవమే పెట్టుబడిగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలకు మూడు చిత్రాలను నిర్మిస్తున్నారు. వాటితోపాటు త్వరలోనే నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఈ సందర్భంగా యంగ్మంత్ర వ్యవస్థాపకుడు కటకం శ్రీకాంత్ (katakam srikanth) మాట్లాడుతూ.. టాలీవుడ్లో మొదటగా డిజిటల్ ప్రమోషన్స్ ప్రారంభించిన సంస్థల్లో యంగ్ మంత్ర ఒకటి. ఇప్పటివరకు 500 చిత్రాలకుపైగా ప్రమోట్ చేశాం. దాదాపు అన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల చిత్రాలకు పని చేశాం. ఆ అనుభవంతోనే ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. మొదటగా ప్రముఖ ఓటీటీ సంస్థలకు మూడు చిత్రాలను నిర్మిస్తున్నాం. ఆ సినిమాలు షూటింగ్ వివిధ దశలలో ఉన్నాయి. అలాగే త్వరలోనే నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని రూపొందించనున్నట్టు చెప్పారు.
మంచి కంటెంట్, డిజిటల్ ప్రమోషన్స్ అనుభవంతో క్వాలిటీ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తామని శ్రీకాంత్ అన్నారు. డిజిటల్ ప్రమోషన్స్ అనేవి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా మరింత అప్డేట్ అవుతూ మరిన్ని ఎక్కువ సినిమాలను తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేయడమే మా లక్ష్యం. త్వరలోనే మా సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్‌లోని ఐదుగురు ప్రముఖ నిర్మాతలు విడుదలచేయనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?