బాలీవుడ్ నటి యామీ గౌతమ్ పెండ్లి పీటలెక్కి అందరికీ షాకిచ్చింది. యురి సినిమాతో నేషనల్ వైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఆదిత్యా ధర్ ను యామీ గౌతమ్ వివాహం చేసుకుంది. వెడ్డింగ్ సెర్మనీకి సంబంధించిన ఫొటోలు యామీ గౌతమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
మా కుటుంబం దీవెనలతో వెడ్డింగ్ సెర్మనీతో మేమిద్దరం ఒక్కటయ్యాం. లవ్, ఫ్రెండ్షిప్ కు కొనసాగింపుగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. యామీ-ఆదిత్యకు మీ దీవెనలు, ఆశీస్సులు కావాలి..అంటూ సోషల్ మీడియా ద్వారా కోరింది యామీగౌతమ్. సంప్రదాయ చీరకట్టులో యామీగౌతమ్ ఆకట్టుకుంటుండగా.ఆదిత్యా ధర్ వైట్ శేర్వాని మ్యాచింగ్ తలపాగాతో కనిపిస్తున్నాడు. కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈవెంట్ కు హాజరయ్యారు. ఆదిత్యాధర్ డైరెక్షన్ లో వచ్చిన యురి సినిమాలో కీ రోల్లో నటించింది యామీ గౌతమ్.
ఇవి కూడా చదవండి..
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట