అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
బిగ్ బాస్ సీజన్ 4 చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అప్పటి వరకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు.. కానీ ఒక్క సీజన్ తో స్టార్స్ అయిపోయారు.

బిగ్ బాస్ సీజన్ 4 చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అప్పటి వరకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు.. కానీ ఒక్క సీజన్ తో స్టార్స్ అయిపోయారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్లకు అవకాశాలు కూడా వస్తున్నాయి. అలా బిగ్ బాస్ 4 నుంచి ఫేమస్ అయిన ముద్దుగుమ్మ దివి. తెలుగు అమ్మాయి అయినా కూడా అప్పటి వరకు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. మహర్షి లాంటి సినిమాలో మహేష్ బాబు పక్కన నటించినా కూడా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాలేదు. కానీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత అక్కడ 50 రోజులు ఉండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది దివి.
బయటికి వచ్చిన తర్వాత మిగిలిన వారితో పోలిస్తే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కెరీర్లో ముందుకు వెళ్తుంది ఈ భామ. ఈ మధ్య రెండు మూడు సినిమాల్లో కూడా నటించింది. అంతే కాదు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది దివి. ఇవన్నీ ఇలా ఉంటే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయింది ఈ భామ. చాలా సంవత్సరాల క్రితమే ఈమె ప్రేమలో పడింది. ఒక అబ్బాయిని చాలా గాఢంగా ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనుకోని విధంగా ఈ ఇద్దరు విడిపోయారు.
ప్రేమించిన అబ్బాయి తమ్ముడు మరణించడంతో.. పెళ్లి చేసుకుని ఊర్లోనే ఉందాం.. కెరీర్ త్యాగం చెయ్ అని అబ్బాయి అనడంతో పరస్పర అంగీకారంతో బ్రేక్ అప్ చెప్పుకుందామని దివి తెలిపింది. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ ప్రేమలో పడలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన కెరీర్ గురించి కొన్ని ముచ్చట్లు చెబుతూ అలాగే పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయిపోయింది. తనకు ఎలాంటి భర్త కావాలో కూడా చెప్పింది దివి.
తన హైట్ 5.8 కాబట్టి తనకు కాబోయే వాడు కనీసం 6.3 అడుగులు ఉండాలని కోరుకుంటుంది..తెలివైనవాడు అయి ఉండాలని.. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలని.. అలాగే తనను చాలా బాగా చూసుకోవాలి అంటుంది. కష్టసుఖాల్లో తోడుగా ఉండి ధైర్యం చెప్పే వాడు అయితే ఒక అమ్మాయికి అంతకంటే కావలసింది ఏముంది.. తనకు కూడా అలాంటి భర్త కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది దివి. మరి ఈమె కోరుకున్న వాడు ఎక్కడ ఉన్నాడో.. ఎప్పుడు వస్తాడో..?
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

