బొమ్మరిల్లు, ఢీ, రెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది జెనీలియా. ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ పెండ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. జెనీలియా కొడుకు రాహిల్ 5వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన ముద్దుల కొడుకుతో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది జెనీలియా. రాహిల్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ…ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఈ రోజు నీ పుట్టినరోజు, నీవు నాకు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని నేను కోరుకుంటున్నాను ..నేను పరిపూర్ణమైన అమ్మను కాదు. నేను తప్పులు చేస్తున్నాను. నేను కొంచెం వెర్రివాడిగా ఉన్న రోజులు ఉన్నాయి. నాకు సంబంధించి అధ్వాన్నమైన విషయాలున్నా, ఒక చిన్న పిల్లవాడు నన్ను ఆశ్చర్యంగా చూస్తాడు.నేను ప్రపంచంలోనే ఉత్తమ తల్లిని..నువ్వు చిన్న రాహిల్ అని నాకు అనిపిస్తుంది.నేను జీవితంలో ఏదో చేశానని నన్ను నమ్మించే ఆ బుడతడు..నా హృదయాన్ని దొంగిలించిన బాలుడు అంటూ తన కొడుకు గురించి బావోద్వేగ పోస్ట్ పెట్టింది.
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!