హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు నిధుల కటకటతో విలవిలలాడుతున్నాయి. ‘పల్లె ప్రగతి’ అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పంచాయతీలను నిధులు ఇవ్వక అంధకారంలోకి నెట్టేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల ఊసే లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. వచ్చిన అరకొర కేంద్ర నిధుల కోసం అటు మాజీ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఇటు కొత్త పాలకవర్గాల మధ్య ‘వార్’ నడుస్తున్నది.
కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా ప్రభుత్వం తన వంతు ‘మ్యాచింగ్ గ్రాంట్’ విడుదల చేయా లి. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటంతో పంచాయతీలకు ఇవ్వాల్సిన పైసలను సరార్ తొకిపెట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ (ఎస్ఎఫ్సీ) ద్వారా అందాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లను ప్రభుత్వం అటకెకించింది. దీంతో పంచాయతీలకు రావాల్సిన వేల కోట్లు నిలిచిపోయా యి. మూడేండ్ల గణాంకాలను పరిశీలిస్తే కాం గ్రెస్ ప్రభుత్వ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రభుత్వ వైఫల్యం వల్ల గ్రామీణ వ్యవస్థలో మూడు కీలక వర్గాలు నేడు రోడ్డెక్కె పరిస్థితు లు దాపురించాయి. 2019-24 వరకు సర్పంచులుగా తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడి న మాజీ సర్పంచులు, తమ పెండింగ్ బిల్లుల కోసం కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రా మాల్లో అత్యవసర పనుల కోసం కార్యదర్శు లు తమ సొంత జేబుల నుంచి నిధులు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ నిధులు తిరిగి రాకపోవడంతో దికుతోచని స్థితిలో ఉన్నారు. వచ్చిన కొద్దిపాటి నిధులూ పాత బకాయిలకే పోతే, తాము ఊర్లలో పనులెలా చేయాలి? అని కొత్త సర్పంచులు సర్కార్ను నిలదీస్తున్నారు.
2019-24 మధ్య గ్రామాల కోసం అప్పు లు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం తో తమ అప్పులకు వడ్డీలు కట్టలేక వారు ఆత్మహత్యల దిశగా వెళ్తున్నారు. తమ పాలనా కాలానికి సంబంధించిన నిధులు విడుదలైనందున పాత బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నారు. 30వ తేదీలోగా తమ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీ హెచ్చరించింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శికి వినతిపత్రం కూడా అందజేసింది.
2023 ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలనసాగింది. రెండేండ్లు పంచాయతీల నిర్వహణ భారం గ్రామ కార్యదర్శులపై పడిం ది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అత్యవసర పనులకు కార్యదర్శులు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. పారిశు ద్ధ్య పనుల నిర్వహణ, ట్రాక్టర్లలో డీజిల్, రిపే ర్, ఇతర పనులకు పెద్ద మొత్తంలో ఖర్చుచేశామని కార్యదర్శులు చెప్తున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వర కు, పెద్ద పంచాయతీల్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టామని అంటున్నారు. తమ వేతనాలను సైతం గ్రామ ఖర్చులకు వినియోగించామని, కేంద్రం నిధులు తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నో ఆశలతో కొత్తగా గెలిచిన సర్పంచులు బాధ్యతలు తీసుకోగానే వారికి శూన్యమే కనిపిస్తున్నది. వచ్చిన కొద్దిపాటి కేంద్ర నిధులు పాత బకాయిలకే పోతే, తాము ఊర్లలో పనులెలా చేయాలి? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు వెచ్చిస్తామని కొత్త సర్పంచులు చెప్తున్నారు. ఈ నిధులన్నీ పాత బకాయిలకే కేటాయిస్తే కొత్త పనులు ఎప్పుడు మొదలుపెట్టాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామాలకు విడుదలవుతున్న నిధులను పాత బకాయిలకు మళ్లిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో కీలకంగా ఉనన ఈ మూడు వ్యవస్థలను సముదాయించడం జిల్లా కలెక్టర్లకు కత్తిమీద సాములా మారింది.
మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ఈ నెల 31తో ముగియనున్నది. ఈ నాలుగు రోజుల గడువులోగా కేంద్రం నుంచి రావాల్సిన మిగతా బకాయి నిధులు రాకపోతే, అవి పూర్తిగా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వినియోగ పత్రాలు సమర్పించకపోవడం, తన వంతు వాటా నిధులు విడుదల చేయకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. సరార్ ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, వెంటనే మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో గ్రామాల్లో పాలన స్తంభించి, పల్లెల ప్రగతి నిలిచిపోతుందని ఆర్థిక నిఫుణులు హెచ్చరిస్తున్నారు.
