Mr Celebrity | పాపులర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. రవికిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో ‘మిస్టర్ సెలెబ్రిటీ’ (Mr Celebrity)గా రాబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి బ్రదర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మమ్మల్ని రైటర్లు, యాక్టర్లు, దర్శకులుగా ఎంతో ఆదరించారు. మా మనవడు మిస్టర్ సెలబ్రిటీ అక్టోబర్ 4న విడుదల కానుంది.
సినిమా విజయవంతం అయ్యేలా మీ ఆశీస్సులు అందించాలని కోరారు. డైరెక్టర్ అద్భుతంగా వర్క్ చేశాడు.. మీ సపోర్ట్‌తో సుదర్శన్ నటుడిగా సుదీర్ఘ కాలం ఇండస్ట్రీ కొనసాగుతాడని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడిగా రవి కిశోర్‌కు ఇది తొలి సినిమా.. సినిమా మీ అందరి అటెన్షన్‌ను తిప్పుకుంటుందని మరో సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
ఈ చిత్రంలో వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రీదీక్ష, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్పీ సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి వినోద్ యజమాన్య సంగీతం అందిస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్ కాంబినేషన్‌కు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథనందించడమే కాదు.. నటులుగా కూడా అలరించారు పరుచూరి బ్రదర్స్.
The legendary writer, Paruchuri Gopala Krishna Garu, launched the release date poster of his grandson’s debut film, #MrCelebrity ✨
In Theatres from Oct 4th 💥
ICYM Teaser
▶️ https://t.co/t2FqD9qbcl#MrCelebrityFromOCT4th#ParuchuriSudarshan #SriDeeksha @varusarath5 #Nasar… pic.twitter.com/622csm4nb3— SR Promotions (@SR_Promotions) September 26, 2024
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్