Ajaz Khan | బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ (Ajaz Khan)పై రేప్ కేసు నమోదైంది (Case Registered). సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు సాయం చేస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు అజాజ్‌పై 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సాయం చేస్తానని నమ్మించి అనేక ప్రాంతాల్లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదులో ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
కాగా, అజాజ్ ఖాన్‌పై ఇప్పటికే అశ్లీల కంటెంట్‌కు సంబంధించి ఓ కేసు నమోదైంది. అజాజ్ హోస్ట్‌గా చేసే ఉల్లు యాప్‌లో ప్రసారమయ్యే వెబ్ షో ‘హౌస్ అరెస్ట్’లో అశ్లీల కంటెంట్ ప్రదర్శించారనే ఆరోపణలపై నటుడితోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పడు తాజాగా మహిళ ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదైంది.
Also Read..
Jammu jails | ఉగ్రవాదులను విడిపించుకునేందుకు జమ్ము జైళ్లపై దాడులకు కుట్ర.. హై అలర్ట్
Tangmarg | ఉగ్రవాదులకు సాయం చేసి.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి వ్యక్తి మృతి
Fire Accident | కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం