Ramgopal Varma| టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చయాంశమైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంత, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించకూడదని ఇప్పటికే ఎక్స్ ద్వారా నటి సమంతకు ట్వీట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. తన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించాడు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటని ప్రశ్నించిన ఆర్జీవీ.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని అని అన్నాడు.
అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి.. ?
అక్కినేని నాగార్జున కుటుంబాన్ని అత్యంత భయంకరంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్స్‌కు నేను షాక్ అయిపోయా. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగడం ఏ మాత్రం భరించకూడదు. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో..? లేదో..? నాకర్థమవ్వటం లేదు?. తనను రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారనీ అసలు ఆ విషయంతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి.. ? అని ప్రశ్నించాడు వర్మ.
4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కండ్లతో చూసి తన చెవులతో విన్నట్లు నిర్దారణకు వచ్చి మీడియా ముందు అరచి చెప్పటం దారుణం. ఒక మంత్రి హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి గౌరప్రదమైన కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశాడు.
సీఎం రేవంత్ రెడ్డిగారు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని.. ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని మరో ట్వీట్ చేశాడు వర్మ .
కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
Chiranjeevi | సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై చిరంజీవి
Samantha | మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : కొండా సురేఖ కామెంట్స్ పై సమంత
Chinmayi Sripada | సమంత అందరికంటే ఉన్నతమైన వ్యక్తి : సింగర్ చిన్మయి