టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటించిన ఎంసీఏ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma). పింక్, గల్లీ బాయ్, సూపర్ 30 లాంటి భారీ ప్రాజెక్టులో మెరిసిన విజయ్ వర్మ మరే తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇంతకీ ఈ హైదరాబాదీ నటుడు ఇప్పుడెక్కనున్నాడో తెలుసా..? ప్రస్తుతం పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. బీటౌన్ సమాచారం ప్రకారం..ముంబైకి సమీపంలోని చిన్న పట్టణంలో జరుగుతున్న జవహర్ (Jawhar ) షూటింగ్లో ఉన్నాడు విజయ్ వర్మ.
వయాకామ్ 18పై నిర్మిస్తున్న జవహర్ చిత్రీకరణ నవంబర్ 18కల్లా పూర్తి కానుండగా..అనంతరం ముంబైకి తిరిగిరానున్నాడు విజయ్ వర్మ. అజయ్ గత 2 నెలలుగా షూటింగ్ కోసం వారణాసిలో ఉన్నాడు. ఆ తర్వాత దీపావళికి హైదరాబాద్‌లో తన కుటుంబంతో టైం గడపటానికి బ్రేక్ తీసుకున్నాడు. దీపావళి మరుసటి రోజు నవంబర్ 5న తిరిగి జవహర్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు.
ఈ నెల చివరికల్లా జవహర్ సినిమాను పూర్తి చేసి..మిగిలిన సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడు. షారుక్ ఖాన్ హోం బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న డార్లింగ్స్ చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేశాడు. ఈ మూవీలో గల్లీ బాయ్ కోస్టార్ అలియాభట్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా