Bobby Deol | సినీ ఇండస్ట్రీ అంటే బయటకు కనిపించే రంగుల ప్రపంచం.. నటీనటులు సిల్వర్‌స్క్రీన్‌పై ఎంత కలర్ఫుల్గా కనిపించినా.. ఆఫ్ స్క్రీన్‌లో పడే కష్టాలు ఎప్పుడో కానీ అంతగా ప్రేక్షకులకు తెలియవు. నటనకు ఆస్కారమున్న ఒక్క సరైన పాత్ర పడితే చాలు ఆ యాక్టర్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చినట్టే. ఎన్నో ఇబ్బందుల మధ్య అలాంటి అరుదైన అవకాశం అందుకున్నాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ (Bobby Deol).
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన యానిమల్‌లో బాబీ డియోల్ పోషించిన అబ్రార్ హాక్ పాత్రకు ఏ రేంజ్లో క్రేజ్ వచ్చిందో తెలిసిందే. అయితే ఈ రోల్లో నటించే ఆఫర్ వచ్చే ముందు బాబీడియోల్ తరచూ తన ఫొటోలను బాలీవుడ్ కాస్టింగ్ ఏజెంట్స్, నిర్మాతలకు పంపించేవాడట. అయినా కానీ ఎలాంటి అవకాశం రాలేదని డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీ (Bobby)చెప్పాడు. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోలో కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఓ చిట్ చాట్‌లో డైరెక్టర్ బాబీ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
బాబీడియోల్ కుటుంబం అతని కష్టతర పరిస్థితులను చూసినప్పుడు ఆయన తరచుగా భావోద్వేగానికి గురయ్యేవాడన్నాడు డైరెక్టర్ బాబీ. బాబీడియోల్‌కు యానిమల్ సినిమా పాత్రను ఆఫర్ చేయడం ఆయన కెరీర్‌ను నిలబెట్టిందని.. ఈ క్రెడిట్ అంతా సందీప్ రెడ్డి వంగాకే దక్కుతుందని చెప్పాడు. సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తావించే ప్రతీసారి బాబీడియోల్ భావోద్వేగానికి లోనవుతారన్నాడు.
డాకు మహారాజ్లో బాబీడియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోసారి ఆయన పవర్ఫుల్ రోల్ మూవీ లవర్స్, అభిమానుల ఇంప్రెషన్‌ను కొట్టేయడం ఖాయమని ధీమాగా చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బాబీ.
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్