Anushka Shetty | ఎవరిని కదిపినా ఏదో ఓ వ్యాధి కామన్ అన్నట్లు మారిపోయింది తెలుగు సినిమా హీరోయిన్ల పరిస్థితి. అరే ఏ ముద్దుగుమ్మను చూసినా కూడా ఏదో ఓ సమస్యతో బాధ పడుతున్నారు. ఇప్పటికే సమంతకు మయోసైటిస్.. పూనమ్ కౌర్‌కు నరాలకు సంబంధించిన వ్యాధి.. రేణు దేశాయ్‌కు గుండె సంబంధిత సమస్య అంటూ రోజుకో న్యూస్ బయటికి వస్తుంటే.. తాజాగా నేనున్నానంటూ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఈమెకు కూడా ఓ అనారోగ్య సమస్య ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు అనుష్కకు ఉన్న సమస్య గురించి తెలుసుకుంటే నవ్వాగదు. ఎందుకంటే ఈమె అనారోగ్యమే నవ్వుతో కూడుకున్నది కాబట్టి.
ఏదైనా నవ్వించే సంఘటన వస్తే.. నాన్‌స్టాప్‌గా 20 నిమిషాల వరకు నవ్వుతూనే ఉంటుందని.. ఆ గ్యాప్‌లో అంతా బయటికు వెళ్లి స్నాక్స్ కూడా తినేసి వస్తారని.. అనుష్క శెట్టి అంతసేపు నవ్వుతూనే ఉంటుందని ఈమెపై వస్తున్న వార్త. అది కూడా ఓ వ్యాధి అని.. చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి అంటూ ప్రచారం జరుగుతుంది. పైగా ఈ న్యూస్ కూడా అనుష్క ఓ తమిళ ఇంటర్వ్యూలో బయటపెట్టిందనేది వైరల్ అవుతున్న న్యూస్. అయితే అందులో నిజం లేదని అనుష్క సన్నిహితులే చెప్తున్నారు. అలాంటిదేం లేదు.. ఆమెకు బరువు పెరిగిన సమస్య మాత్రమే ఉంది కానీ ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేవని అనుష్క పీఆర్ టీమ్ చెబుతోంది. మరి ఇందులో నిజమేంటి అనేది మాత్రం స్వయంగా అనుష్క బయటికి వచ్చి క్లారిటీ ఇస్తే కానీ తెగదు. లేదంటే ఈ వ్యాధి కారణంగానే జేజమ్మ సినిమాలకు బ్రేక్ ఇచ్చిందేమో అనే అనుమానాలు కూడా రాక మానవు.
భాగమతి తర్వాత అనుష్క సినిమా ఒక్కటి కూడా థియేటర్లలో విడుదల కాలేదు. భాగమతి 2018లో విడుదలైంది. ఆ తర్వాత హేమంత్ మధుకర్ తెరకెక్కించిన నిశ్శబ్ధం సినిమా ఓటీటీలో వచ్చింది. అది ఆకట్టుకోలేదు కూడా. దాంతో ఇప్పుడు ఈమె ఆశలన్నీ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్లో మహేష్ బాబు దర్శకత్వంలో వస్తుంది ఈ చిత్రం. దీనికి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
RRR at Oscars | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్‌ను కలిసిన చంద్రబోస్