ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. తాజాగా నాటు నాటు ఆస్కార్స్‌కు నామినేట్ కాగా.. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట నామినేట్ అయ్యింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్టెప్పులు వేసిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్, కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అద్భుతంగా పాట పాడారు.
అయితే ఈ పాటకు లిరిక్స్, సంగీతం అందించిన చంద్రబోస్, కీరవాణిలకు అకాడమీ నుంచి పిలుపొచ్చింది. ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన లంచ్ మీట్‌కు వీరిద్దరికి అహ్వానం రాగా చంద్రబోస్, కీరవాణిలు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన హాలీవుడ్ ప్రముఖులతో కీరవాణి, చంద్రబోస్‌లు ముచ్చటించారు. ఈ క్రమంలోనే అక్కడకు టాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ వచ్చారు. దీంతో టామ్ క్రూయిజ్‌ని కలిసిన చంద్రబోస్ తన అనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
”హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన హీరో టామ్ క్రూయిజ్‌ను కలిశాను. విత్ టాప్ గన్ టామ్‌తో ఇది ఫ్యాన్ బాయ్ మూమెంట్” అని చంద్రబోస్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఈ పిక్ వైరల్‌గా మారింది.
ప్రస్తుతం కీరవాణి, చంద్రబోస్ లాస్ఏంజిల్స్లో ఉన్నారు. ఈ సందర్భంగా మార్చి 12న డాల్బీ థియేటర్ వేదికగా చేయబోతున్న లైవ్ పర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించారు కీరవాణి. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట లైవ్ పర్ఫార్మెన్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయని తెలిపారు. ఈ పర్ఫార్మెన్స్ కోసం భారత్ నుంచి సింగర్స్‌ను తీసుకొస్తున్నాం. నృత్య బృందాన్ని మాత్రం ఇక్కడి నుంచే ఎంపిక చేసుకుంటున్నాం. చక్కటి టీమ్ వర్క్‌తో లైవ్ పర్ఫార్మెన్స్ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాం’ అని కీరవాణి అన్నారు.
మార్చి 12న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరుగనుండగా.. ఈ వేడుక కోసం భారతీయ సినీ ప్రేమికులందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గుమ్మం ముందు నిలిచిన ‘నాటు నాటు’ పాటకు అవార్డు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
With top gun TOM❤️❤️❤️❤️ pic.twitter.com/ZaFYhjteRB
— chandrabose (@boselyricist) February 14, 2023