Navdeep | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ నవదీప్ త్వరలో బ్యాచ్‌లర్ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. కాగా మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా నవదీప్ ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్ అంటూ మొహం దాచుకున్న ఓ అమ్మాయి ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. ఈ ఫోటోలో అమ్మాయి చేతుల నిండా మెహందీ పెట్టుకుని ఉంది. అంతేకాకుండా ఓ చేతితో మొహం దాచుకుంటూ మరో చేతితో మెరిసిపోతున్న ఉంగరాన్ని చూపిస్తున్నట్లున్న ఫోటోను నవదీప్ షేర్ చేస్తూ ఖుషీ అహుజా అనే పేరును జత చేశాడు.
దాంతో నెటీజన్లు ఎవరా ఖుషీ అని వెతకడం స్టార్ట్ చేశారు. తీరా అకౌంట్ గురించి సర్చ్ చేస్తే అది ప్రాంక్ అని తేలింది. దాంతో పలువురు నెటిజన్లు ఏంటన్నా గుడ్‌న్యూస్ చెప్తావనుకుంటే.. ఇలా బకరా చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని నవదీప్ అన్న మోసం చేశాడని వీడియో పెట్టాడు. కాగా ఇప్పటికే నవదీప్ ఎన్నో సార్లు తనకు పెళ్లంటే ఇష్టముండదని, ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తున్నా.. తనకు పెళ్లి చేసుకునే ఉద్ధేశమే లేదని ఎన్నో సార్లు చెప్పాడు. ఇక నవదీప్ సినిమాల విషయానికొస్తే.. హీరోగా కెరీర్ ప్రారంభించిన నవదీప్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లవ్‌మౌళి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.