Anasuya Bharadwaj | నెటిజన్ కామెంట్‌కు అనసూయ ఆగ్రహం.. చెప్పుతో కొడతానంటూ..
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Anasuya Bharadwaj | టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. మంగళవారం వాలెంటైన్స్ డే సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నీతో జీవితం క్రేజీగా.. రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందంటూ’ ఫోటోకు కాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటీజన్ ‘అదేం లేదులే అక్కా.. వాడి దగ్గర బాగా డబ్బుంది, దట్స్ ఇట్’ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు అనసూయకు కోపం వచ్చి నెటీజన్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.
‘అదేంట్రా తమ్ముడూ.. అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పులతోటి.. సారీ నా అర్థం చెప్పులతో చెంపలేస్తానని’ అంటూ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. అయితే దీనిపై ఆ నెటీజన్ రియాక్టవుతూ.. ‘మీరు రియాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు ఎంత చెప్పినా, రియాలిటీ రియాలిటీనే’ అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై అనసూయ స్పందించి ‘నీ బొందరా నీ బొంద మాట్లాడటం నేర్చుకో ఫస్ట్. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి మనీ ఒకటే అయితే అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే మారు. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా.. మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అంటూ స్వీట్‌గా మరో రిప్లై ఇచ్చింది. అయితే ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. ఆ నెటీజన్ వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇక అనసూయ రెండు, మూడు కామెంట్స్‌కు రిప్లై ఇచ్చి వీడితో ఎందుకులే అనుకుని రిప్లై ఇవ్వడం మానేసింది. ఇలా వాలెంటైన్స్ డే రోజున అనసూయ మరో వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!



