Anushka Shetty | పలువురు స్టార్ నటీమణులు ఇటీవల అరుదైన వ్యాధుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నటి సమంత, కల్పికా గణేష్, మమతా మోహన్ దాస్, రేణు దేశాయ్ తదితర తారలు పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అవసరమైన చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో నటి వచ్చి చేరింది. ఆ నటి మరెవరో కాదు.. అనుష్ శెట్టి. ప్రస్తుతం ఆమె ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతోందట. ఈ విషయాన్ని అనుష్కనే స్వయంగా వెల్లడించింది.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. ‘నాకో అరుదైన వ్యాధి ఉంది. నవ్వే పరిస్థితి వస్తే పడి పడి నవ్వుతూనే ఉంటాను. దాన్ని అసలు కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. నేను నవ్వడంతో చాలాసార్లు షూటింగ్ కూడా ఆపేయాల్సి వచ్చింది. ఆ గ్యాప్లో ప్రొడక్షన్ టీమ్ తమ పనులను చక్క బెట్టుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది.
కాగా, అనుష్క ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీలో యువ నటుడు నవీన్ పోలీశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.