The Girl Friend | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓ కాలేజ్‌లో జరిగే ప్రేమ కథ. ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించేలా సినిమా సాగుతుందన్నాడు. రష్మిక కథ విన్న వెంటనే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాకు ఒకే చెప్పింది. యూత్ ఆడియెన్స్‌కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని దృఢంగా నమ్ముతున్నాం. సినిమా విడుదల తర్వాత రష్మికకు మేం రెట్టింపు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నామని చెప్పుకొచ్చాడు ధీరజ్ . ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై అంచనాలు ఆరీగానే ఉన్నాయి.