Operation Safed Sagar First Look | తమిళ నటుడు సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్గిల్ వార్ టైంలో భారత సైన్యానికి మద్దతునిస్తూ భారత వాయుసేన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar)ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తుండగా.. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ అంటూ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో జిమ్మీ షేర్గిల్ (Jimmy Shergill), అభయ్ వర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.