ఫలక్‌నుమా దాస్ సినిమాతో క్లాస్, మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) . ప్రస్తుతం ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. విశ్వక్ సేన్ నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి అశోక వనంలో అర్జుణ కల్యాణం (Ashoka Vanam Lo Arjuna Kalyanam). విద్యాసాగర్ చింత డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ (AVAK trailer)ను మేకర్స్ విడుదల చేశారు. రుష్కర్ ధిల్లాన్ (Ruskhar Dhillon) హీరోయిన్గా నటిస్తోంది.
‘అంటే ఎంగేజ్మెంట్ కదండి..గెటప్ ఛేంజ్ చేశా’ అంటూ విశ్వక్ సేన్ సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ‘మా సూర్యాపేటలో మొత్తం ఒక్కటే టాపిక్. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు..పెళ్లి కాలేదు..’అని చెబుతున్నాడు విశ్వక్ సేన్. ‘కుదిరింది..కుదిరింది పెళ్లి.. ఊరుగాని ఊరు..కులం గాని కులం..ఒకటి కాని యాస ‘అంటూ వస్తున్న వాయిస్ ఓవర్ సరికొత్తగా ఉంది.
‘గోదారోళ్లమండీ..ఏం పెట్టినా మర్యాదగానే పెడతాం..అని పెళ్లి కూతురు తరపు వాళ్లంటుంటే..మేం తెలంగాణలోళ్లం మాకు మర్యాద ఒక్కటి సరిపోదు…మటన్ కూడా కావాలని’ పెళ్లి కొడుకు తరపు బంధువులు చెప్పే డైలాగ్స్ కొత్తగా ఆకట్టుకునేలా సాగుతున్నాయి.
సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే యువకుడికి గోదావరి జిల్లాల నుంచి సంబంధం కలుపుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత సంబంధం కుదిరినట్టే కుదిరి…రద్దనయిట్టు ట్రైలర్‌తో చెప్పాడు డైరెక్టర్. ఇంతకీ విశ్వక్ సేన్‌కు పెళ్లయిందా..? కాలేదా..? అనే దానిపై సస్పెన్స్ పెడుతూ సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రానికి రవి కిరణ్ స్క్రిప్ట్ అందించగా.. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.