Mechanic Rocky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). విశ్వక్ సేన్ 10 (VS 10)గా వస్తోన్న ఈ మూవీని రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నవంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
వీడు మా అబ్బాయి దేనికి పనికి రాడు.. అంటూ ట్రైలర్లో నరేశ్ తన కొడుకు మెకానిక్ రాకీ గురించి చెబుతున్న సంభాషణలు ఫన్నీగా సాగుతున్నాయి. ఓ వైపు మెకానిక్ రాకీగా.. మరోవైపు లవర్ బాయ్ విశ్వక్ సేన్ ఫన్, లవ్, సీరియస్ ట్రాక్‌తో మాస్ కా దాస్ మార్క్ ఎలిమెంట్స్‌తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
మెకానిక్ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే షేర్ చేసిన గుల్లెడు గుల్లెడు సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. విశ్వక్సేన్ ఇప్పటికే మెకానిక్ రాకీగా చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న లుక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మెకానిక్ రాకీ ట్రైలర్..
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?