Mechanic Rocky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ నటుడు లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). విశ్వక్ సేన్ 10 (VS 10)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
తాజాగా మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. మెకానిక్ రాకీ ట్రైలర్‌ను అక్టోబర్ 20న శ్రీరాములు థియేటర్లో మధ్యాహ్నం 3 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ అప్డేట్ పోస్టర్లో విశ్వక్సేన్ భుజంపై దస్తీ పట్టుకొని మాసీ లుక్‌లో కనిపిస్తుండగా.. ఇరువైపులా మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్‌ను చూడొచ్చు.
ఈ చిత్రాన్ని నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విశ్వక్సేన్ మెకానిక్ రాకీగా చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
మరోవైపు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో పాపులర్ గాయని మంగ్లీ మ్యాజికల్ వాయిస్ అందించిన గుల్లెడు గుల్లెడు సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Get ready!
Coming to you, with a trailer launch 🥳
📍Sree Ramulu Theatre
🗓️ 20th October
🕒 3 pmLet’s ROCK it with #MechanicRocky ❤️🔥
See you all there 💥#MechanicRockyOnNOV22 🛠‘Mass Ka Das’ @VishwakSenActor @itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @ShraddhaSrinath… pic.twitter.com/wHFMk2Ao4N
— BA Raju’s Team (@baraju_SuperHit) October 16, 2024
Allu Arjun | పుష్పరాజ్ క్రేజ్.. అల్లు అర్జున్ను కలిసేందుకు సైకిల్‌పై 1600 కిలోమీటర్ల ప్రయాణం
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?