Mechanic Rocky | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). విశ్వక్ సేన్ 10 (VS 10)గా వస్తోన్న ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మెకానిక్ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారని తెలిసిందే. రాకింగ్ మ్యూజిక్‌తో మీ మాన్సూన్ మ్యూజిక్ ప్లే లిస్టును అప్డేట్ చేసుకోండి.. అంటూ మేకర్స్ తాజాగా గుల్లెడు గుల్లెడు సాంగ్ ఎప్పుడు రాబోతుందో తెలియజేశారు.
ఈ సాంగ్‌ను ఆగస్టు 7న సాయంత్రం 4:04 గంటలకు లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ లుక్ విడుదల చేశారు. మెకానిక్ రాయ్ మ్యూజికల్ రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. హైఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది..ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ లాంచ్ చేసిన పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విశ్వక్సేన్ మెకానిక్ రాయ్‌గా చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. ఈ సారి మాస్ కా దాస్ తనలోని ఫన్ యాంగిల్‌ను చూపించబోతున్నాడంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
1st single #GulleduGulledu from #MechanicRocky will be out on August 7th at 4:04PM 🤩
A @JxBe musical 🎵#MechanicRockyOnOCT31 🛠️ pic.twitter.com/9fOsPH2shk
— BA Raju’s Team (@baraju_SuperHit) August 5, 2024
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!