సన్నీలియోన్ (Sunny Leone)..ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్‌తో ఫాలోవర్లను ఖుషీ చేస్తుంటుంది. తనకు సంబంధించిన విషయాలను, ఫన్నీ మూమెంట్స్ ను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. ఈ భామ తాజా హార్రర్ వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చింది. హార్రర్ వీడియో అంటే ఏ హార్రర్ సినిమాలో అనుకునేరు. సినిమాలో చూపించేంత భయానకం కాదు కానీ..ఎంతలా భయపెట్టేదో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఇంతకీ అసలు విషయమేంటంటే సన్నీలియోన్ ప్రస్తుతం టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)తో ఓ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబీ సోయగం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఈ చిత్రంలో మరో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. గ్యాంగ్ స్టర్ గంగరాజు ఫేం డైరెక్టర్ ఇషాన్ సూర్య (Eeshaan Surya). ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన ఓ ఫన్నీ సరదా వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సన్నీలియోన్.
విష్ణు నడుచుకుంటూ రాగా..సడెన్‌గా మాస్క్ పెట్టుకుని ఉన్న సన్నీలియోన్..ఆ మాస్క్‌ను తీసేయగా ఆమెను చూసి విష్ణు భయపడటం వీడియోలో చూడొచ్చు.మళ్లీ నాకు ఎపిక్ ఫెయిల్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది సన్నీలియోన్. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథనందించారు.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.