Rashmika Mandanna | ‘నాలో ఏదో తెలియని ఫీలింగ్’..రష్మిక ట్వీట్ వైరల్
ఏప్రిల్ 6న చెన్నైలో గ్రాండ్‌గా విజయ్ (Vijay 66th) 66వ సినిమా షురూ అయింది. ఈ మూవీలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాను చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించే విజయ్‌తో నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తోంది రష్మిక.
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) బీస్ట్ సినిమా విడుదలవక ముందే టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి (Vamshi Paidipally)తో కొత్త సినిమా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6న చెన్నైలో గ్రాండ్‌గా విజయ్ (Vijay 66th) 66వ సినిమా షురూ అయింది. ఈ మూవీలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాను చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించే విజయ్‌తో నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేస్తోంది రష్మిక. రష్మిక ఎంత హ్యాపీమూడ్‌లో ఉందో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న పూజా సెర్మనీ ఫొటోలు చూస్తే తెలిసిపోతుంది.
అయితే తాజాగా తన సంతోషాన్ని ట్వీట్‌తో షేర్ చేసుకుంది రష్మిక. ఒకే నాలో ఇపుడేదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. ఎన్నో ఏళ్లుగా సార్‌ను చూస్తూనే, గమనిస్తూనే ఉన్నా. ఇపుడు నేనేం చేయాలనుకున్నానో ప్రతీ ఒక్కటి చేసే సమయం వచ్చింది. ఆయనతో నటించడం, డ్యాన్స్ చేయడమే కాదు..యా..యా..ఫైనల్‌గా ఆయనతో మాట్లాడే ఛాన్స్ వచ్చేసింది..అంటూ తన ఎక్జయిట్‌మెంట్‌ను ట్విటర్ ద్వారా అందరితో పంచుకుంది. రష్మిక ట్వీట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Ok now this feels like something else… ❤️❤️ Been watching sir for years and years and now to do everything that I’ve been wanting to do.. act with him, dance with him, take his nazar, talk to him.. everything .. yaaaaay finally! 😄❤️ An absolute delight.. ❤️#talapathyvijay pic.twitter.com/SHtFfKryip
— Rashmika Mandanna (@iamRashmika) April 7, 2022
Read Also : Raashi Khanna | దయచేసి ఆపేయండి..కల్పిత కథనాలపై రాశీఖన్నా ట్వీట్
టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో విజయ్ 66వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్. విజయ్-పూజాహెగ్డే నటించిన బీస్ట్ ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also : Yadagara Yadagara Lyrical Song | కేజీఎఫ్ 2 నుంచి ‘ఎదగరా ఎదగరా’ సాంగ్ వీడియో..అమ్మ సెంటిమెంట్ రిపీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

