Yadagara Yadagara Lyrical Song | కేజీఎఫ్ 2 నుంచి ‘ఎదగరా ఎదగరా’ సాంగ్ వీడియో..అమ్మ సెంటిమెంట్ రిపీట్
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ' ఎదగరా ఎదగరా దినకరా..' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ‘ ఎదగరా ఎదగరా దినకరా..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘ ఎదగరా ఎదగరా దినకరా..జగతికే జ్యోతిగా నిలవరా..పడమరా..నిశితెర వాలనీ చరితగా ఘనతగా వెలగరా..అంతులేని గమ్యం కదరా..అంతవరకు లేదిక నిదురా..’ అని ఓ తల్లి తన కొడుకు గురించి పాడుకుంటున్న పాట కేజీఎఫ్ థీమ్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్‌తో సాగుతూ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేసేలా కనిపిస్తోంది. రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రాశారు. రవిబస్రూర్ కంపోజ్ చేసిన ఈ పాటను సుచేత బస్రూర్ పాడింది.
కేజీఎఫ్ చాఫ్టర్ 1లో ప్రశాంత్ నీల్ సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన అమ్మ సెంటిమెంట్ ప్రేక్షకులకు ఏ రేంజ్లో కనెక్ట్ అయ్యిందో తెలిసిందే. ఇపుడిదే సెంటిమెంట్‌ను రెండో పార్టులో కూడా మిస్పవకుండా చూసుకున్నట్టు తాజా సాంగ్‌తో తెలిసిపోతుంది.
Read Also: Tollywood Villain | స్ట్రాంగ్ విలన్ కోసం టాలీవుడ్ ఎదురుచూపులు..!
శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. హిందీతోపాటు దక్షిణాది భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో రవీనాటాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Also : Saiee Manjrekar | వరుణ్‌తేజ్ స్వీటెస్ట్ కోస్టార్..గని హీరోయిన్ సయీ మంజ్రేకర్ చిట్‌చాట్
Read Also : Samantha Vs Chaitanya | బాక్సాఫీస్ క్రేజీ ఫైట్..సమంత వర్సెస్ చైతూ వర్సెస్ అఖిల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

