దబాంగ్ 3 సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరిసింది బాలీవుడ్ (Bollywood) యాక్టర్ కమ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar). ఈ బ్యూటీ ఇపుడు వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న గని (Ghani) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది గని. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను పంచుకుంది.
వరుణ్ తేజ్‌తో పనిచేయడమెలా ఉందని అడుగగా..నేను పనిచేసే కోస్టార్లలో వరుణ్‌తేజ్ స్వీటెస్ట్ పర్సన్. సినిమా షూటింగ్లో వరుణ్ నాకు చాలా సాయం చేశాడు. ఓ సందర్భంలో సాయం కోసం వరుణ్ తేజ్ దగ్గరకు చాలా సార్లు వెళ్లా..ఏ మాత్రం విసుక్కోకుండా హెల్ప్ చేశాడు. సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఈ చిత్రం అందరినీ ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని చెప్పింది.
సినిమాలో మీ పాత్ర గురించి చెప్పమనగా..రియల్ లైఫ్‌లో నేనెలా ఉంటానో..అలాంటి అమ్మాయిగా మాయ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేశా. డైరెక్టర్ నన్ను చాలా అద్బుతంగా చూపించారంది.
గని చాలా సార్లు వాయిదా పడటంతో ఎలా ఫీలయ్యారని అడిగితే..నేనసలు కొంత కూడా నిరాశపడలేదు. నేను విధిని చాలా నమ్ముతా. ప్రతీ దానికి వెనుక ఏదో ఒక కారణముంటుంది. గని సోలోగా విడుదలవుతుండటం, సినిమాపై మంచి బిజినెస్ జరుగడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సయీ మంజ్రేకర్.