చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్ డైలాగ్ డెలివరీలో డిఫరెంట్ స్టైల్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు (Tollywood) మెగాబ్రదర్స్ తమ తమ స్టైల్స్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు. సాధారణంగా చిరంజీవి స్టైల్, సినిమాలను అందరూ ఫాలో అవడం చూస్తుంటాం. కానీ చిరంజీవి మరో హీరో స్టైల్‌ను అనుసరిస్తే..అది కూడా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన సీన్‌ను మరోసారి చేస్తాడంటే..? ఎలా ఉంటుంది. ఈ క్రేజీ అప్ డేట్ వినడానికి చాలా బాగుంది కదా..ఇంతకీ విషమేంటనే కదా మీ డౌటు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ నటించిన పాపులర్ సీన్లో నటించబోతున్నాడట. ఈ వార్త ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చిరంజీవితో మెహర్ రమేశ్ చేస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). ఈ చిత్రంలో టీవీ యాంకర్ శ్రీముఖి కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషీలో పవన్ కల్యాణ్ హీరోయిన్ భూమిక నడుమును చూసే (Navel scene) సీన్ ఏ రేంజ్లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే.
ఈ సన్నివేశంలో పవన్, భూమిక మధ్య జరిగే వార్‌ను థియేటర్లలో మూవీ లవర్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు.ఇపుడిదే సన్నివేశాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని భోళాశంకర్‌లో కూడా ఓ సీన్ పెట్టాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తన నడుమును చూశావ్..అని శ్రీముఖి ఆరోపిస్తుంటే..చిరంజీవి ఫన్నీ మ్యానర్‌లో ఇంతకీ నడుమెక్కడుందీ అంటూ రిప్లై ఇస్తాడట.
మొత్తానికి ఈ క్రేజీ న్యూస్ లో నిజమెంత ఉందనేది పక్కన పెడితే..చిరంజీవి, శ్రీముఖి మధ్య ఖుషీ సీన్ ఉంటే ఎలా ఉంటుందని అప్పుడే ఊహించేసుకుంటున్నారు సినీ జనాలు. మరి ఈ అప్ డేట్ నిజమయ్యేనా..? అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.