టాలీవుడ్ (Tollywood) ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju)సినిమా చేస్తున్నారంటే మినిమం హిట్ గ్యారంటీ. ఆయన నిర్మించిన కొన్ని సందర్బాల్లో మాత్రమే ఫెయిల్యూర్స్ గా నిలుస్తుంటాయి. డిజాస్టర్‌గా నిలిచిన వాటిలో రామయ్యా వస్తావయ్యా (Ramayya Vastavayya) సినిమా ఒకటి. 9 ఏళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ 9 చిత్రాలు చేశాడు. ఈ గ్యాప్ లో ఎన్నో సినిమాలు చేసిన దిల్ రాజుకు మళ్లీ తారక్‌తో ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మాత్రం రాలేదు.
కానీ ఇన్నాళ్లకు సినిమా చేయాలన్న ఆ ఆలోచన వచ్చినట్టుంది. ఎన్టీఆర్ మరో చిత్రం చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రాంచరణ్‌తో 9ఏళ్ల క్రితం ఎవడు సినిమా చేసిన దిల్ రాజు ప్రస్తతుం ఆర్సీ 15 మూవీ చేస్తున్నాడు. ఇదే రూట్లో ఇపుడు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేసేందుకు ప్రయత్నాల్లో మునిగిపోయాడని ఫిలింనగర్ సర్కిల్ ఓ వార్త రౌండప్ చేస్తోంది. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా..? అనిల్ రావిపూడినట.
అయితే ప్రస్తుతానికి తారక్ ఖాతాలో కొరటాల శివ (Koratala Siva), బుచ్చిబాబు సినిమాలున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ రెండు పూర్తయిన తర్వాత దిల్‌రాజు సినిమా పట్టాలెక్కే అవకాశాలుంటాయని భావిస్తున్నారు సినీ జనాలు. వచ్చే ఏడాది ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూసే ఛాన్స్ లేకపోలేదని భావిస్తున్నారు మూవీ లవర్స్. అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథమ్ తర్వాత మరే సినిమా చేయని దిల్‌రాజు ‘ఐకాన్’తో ట్రాక్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.