టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి స్టార్ (Chiranjeevi) డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో పనిచేయనున్నట్టు ఓ అప్డేట్ ఇప్పటికే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ లో నటించాడు చిరు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. యాడ్ ఫిల్మ్ షూటింగ్ లొకేషన్లో దిగిన ఫొటోలను అందరితో పంచుకున్నాడు. సుకుమార్ టాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రతీ ఒక్కరికి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను.
యాడ్‌ను నిర్మిస్తున్న శుభగృహ రియల్ ఎస్టేట్ (Subhagruha real estate company) కంపెనీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు చిరు. ఈ యాడ్‌లో చిరంజీవి ఎప్పుడూ కనిపించని విధంగా ఫార్మల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో చేసిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది.
దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను.ఈ యాడ్ నిర్మించిన శుభగృహ రియల్ ఎస్టేట్ వారికి శుభాభినందనలు. pic.twitter.com/3iZmcyLmvy
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 1, 2022
మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్లో గాడ్ ఫాదర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీంతోపాటు బాబీ డైరెక్షన్ లో చిరు 154 కూడా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కొనసాగుతున్నట్టు టాక్.