ఇండియా సెలబ్రిటీల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ ఒకడు బాలీవుడ్ (Bollywood) యాక్టర్ రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor). కెరీర్లో ఇప్పటివరకు ఎంతోమందితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ యువ హీరో ఫైనల్‌గా ఓ ఇంటివాడయ్యేందుకు రెడీ అయ్యాడు. తన స్నేహితురాలు, కోస్టార్ అలియాభట్ (Alia Bhatt)ను పెళ్లి చేసుకోబోతున్నాడు రణ్ బీర్ కపూర్. ఏప్రిల్ 17న వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు బీటౌన్ సమాచారం.
అయితే ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇపుడు తెరపైకి వచ్చింది. ఇంతకీ అంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే..వెడ్డింగ్ ఈవెంట్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ రాబోతున్నారట. వాళ్లెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే (Deepika Padukone), కత్రినాకైఫ్ (Katrina Kaif). గతంలో ఈ ఇద్దరితో రణ బీర్ కపూర్ లివింగ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేశాడు. వెడ్డింగ్ సెర్మనీ ఈవెంట్‌ను ఏప్రిల్ 13-17 డేట్స్ మధ్యలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
మెహందీ, సంగీత్ వేడుకలు ఈ తేదీల్లోనే నిర్వహించనున్నట్టు టాక్. కపూర్ వంశానికి చెందిన వారసత్వ నివాసం ఆర్కే బంగ్లా (RK bungalow) రణ్‌బీర్‌కపూర్, అలియాభట్‌ల పెళ్లికి వేదిక కానుంది. అతికొద్దిమంది సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన స్నేహితులకు మాత్రమే ఆహ్వానం అందించనున్నారని టాక్.