Pawan kalyan Martial Arts | మార్షల్ ఆర్ట్స్ సెషన్లో ‘హరిహర వీరమల్లు’..స్టైల్ అదిరింది
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఇప్పటికే నటించిన కొన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించాడు. పవన్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu).
యాక్టింగ్‌తోనే కాదు..మార్షల్ ఆర్ట్స్ తో కూడా అభిమానులను ఎంటర్ టైన్ చేసే యాక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్. ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే నటించిన కొన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూపించాడు. పవన్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu).
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పవర్ స్టార్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చాలా రోజుల విరామం తర్వాత హరిహరవీరమల్లు షూటింగ్ హైదరాబాద్ లో షురూ అయినట్టు ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. అయితే తాజాగా పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్ డేట్ వచ్చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పవన్ ఏప్రిల్ 8 నుంచి షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.

సినిమాలో కథానుగుణంగా వీరమల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య అవసరమైనందున.. దీనికోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. ఇపుడు తనలోని మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిని పూర్తి స్థాయిలో చూపించబోతున్నాడీ హీరో. అందుకు పవన్ కల్యాణ్ లాంగ్ హెయిర్‌తో తాజాగా మార్షల్ ఆర్ట్స్ సెషన్లో పాల్గొన్న ఫొటోలే దీనికి నిదర్శనం. తన ట్రైనర్‌తో కలిసి మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు మరోసారి పదునుపెడుతున్నాడీ భీమ్లానాయక్.

17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి వీరమల్లు జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోబాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషిస్తున్నారు. పవన్ కల్యాణ్ సుమారు 5 నెలలపాటు షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు టాక్.
https://twitter.com/HHVMFilm/status/1511918222928674822
Read Also : Raashi Khanna | దయచేసి ఆపేయండి..కల్పిత కథనాలపై రాశీఖన్నా ట్వీట్
Read Also : Yadagara Yadagara Lyrical Song | కేజీఎఫ్ 2 నుంచి ‘ఎదగరా ఎదగరా’ సాంగ్ వీడియో..అమ్మ సెంటిమెంట్ రిపీట్
Read Also : 18 Pages Glimpse video | ప్రేమించడానికి కారణముండకూడదు..’18 పేజెస్’ గ్లింప్స్ వీడియో

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

