టాలీవుడ్ (Tollywood) హీరో నిఖిల్ (Nikhil) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు 18 పేజెస్ (18 Pages Glimpse video). కోలీవుడ్ భామ (Anupama Parameswaran) అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.’నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూండేది..ప్రేమించడానికి కారణముండకూడదు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్సర్ ఉండకూడదు..’అని నిఖిల్ సంభాషణలతో మొదలైంది వీడియో.
ఆ తర్వాత ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే..తిక్కన తీర్చేనుగా..రాధమ్మ ఆపిన పాట మధురిమ..కృష్ణుడు పాడెనుగా..’అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో సాగుతున్న గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ (Palnati Surya Pratap) డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.