Mark Antony | టాలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal) నటిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మార్క్ ఆంటోనీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం అదిరిపోయే మోషన్ పోస్టర్‌ను లాంఛ్ చేశారు. సునీల్, ఎజేసూర్య, సెల్వ రాఘవన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తూ.. స్టన్నింగ్ విజువల్స్ తో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మోషన్ పోస్టర్ విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకుపైగా వ్యూస్ రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. సునీల్ కెరీర్లో ఇప్పటివరకు కనిపించనట్వంటి డిఫరెంట్ లుక్‌లో ఎంటర్టైన్ చేయబోతున్నాడని మోషన్ పోస్టర్‌తో అర్థమవుతుంది. మార్క్ ఆంటోనీ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
విశాల్ నటించిన లాఠీ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. విశాల్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
5,00,000 + Views & Counting !!
Proudly Presenting #MarkAntony Official Motion Poster https://t.co/xcHRWPa6iJ#MarkAntonyMotionPoster @VishalKOfficial @Adhikravi @iam_SJSuryah @gvprakash @selvaraghavan @vinod_offl pic.twitter.com/ZvFYauPT6e
— BA Raju's Team (@baraju_SuperHit) March 9, 2023
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
KA9 | స్పీడు మీదున్న కిరణ్ అబ్బవరం.. కొత్త సినిమా లాంఛ్
Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్