Varun Sandesh | హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో యూత్‌లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యువ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh). ఈ ఏడాది సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మైఖేల్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించాడు వరుణ్ సందేశ్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఒకటి. తాజాగా ఈ మూవీకి మేకర్స్ చిత్రం చూడర (Chitram Choodara) టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్ సందేశ్, ధన్ రాజ్, కాశీ విశ్వనాథ్ జైలులో ఉన్న లుక్ చూసి.. వీరంతా ఏదైనా సీరియస్ క్రైం చేశారా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అసలేం జరిగిందనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ ప్రాజెక్ట్‌లో రవిబాబు, తనికెళ్లభరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. నేనింతే ఫేం శియా గౌతమ్ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది.
బీఎం సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాధన్ మ్యూజిక్ డైరెక్టర్. దినేశ్ కే బాబు కెమెరామెన్‌గా పనిచేస్తన్నాడు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
వరుణ్ సందేశ్ చిత్రం చూడర టైటిల్, ఫస్ట్ లుక్..
Get ready for an amusing ride with @itsvarunsandesh & gang 😀🤘
Here's the First Look of @BMCinemas_ Production No-1 #ChitramChudara 👀
Directed by @NHarsha828 🎬
Music by @radhanmusic 🥁#SeshuMaramreddy #BoyapatiBhagyalakshmi @DhanrajOffl#KasiViswanath #DhanaTummala pic.twitter.com/gRB7VDprqi— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 9, 2023
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్