బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). మూవీ లవర్స్ కు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ.. కొత్త నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే ఈ టాలెంటెడ్ హీరో నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కాగా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మీటర్ సినిమాలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. తాజాగా కిరణ్ అబ్బవరం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ప్రాజెక్ట్ KA9 (KA9) . ఈ మూవీ పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. నిర్మాతలు ఏఎం రత్నం, సురేశ్ బాబు కెమెరా స్విఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, కేఎస్ రామారావు, శిరీష్, వల్లభనేని వంశీ, కేకే రాధామోహన్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జోజో జోస్, రవి, రాకేశ్ రెడ్డి నిర్మాతలు కాగా.. బీ సురేశ్ రెడ్డి, సంతోష్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం రమేశ్ కడూరి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ మీటర్ (Meter)లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మీటర్ ఫస్ట్ లుక్‌తోపాటు టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. మీటర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం మరోవైపు రూల్స్ రంజన్ సినిమా కూడా చేస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం KA9 లాంఛింగ్ స్టిల్స్..
Young Hero #KiranAbbavaram's #KA9 Grand Pooja ceremony commenced today🤗
directed by #Viswakarun Produced By @SivamCelluloids#KiranAbbavaram9🔥
@Kiran_Abbavaram@SamCSmusic@Jojo__Jose@PRDuddiSreenu@ProSiddhu_ pic.twitter.com/NyNWzWBfew— BA Raju's Team (@baraju_SuperHit) March 9, 2023
మీటర్ టీజర్..
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్