యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ..‘ఎనిమీ’ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామెన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
సాంకేతిక నిపుణులు…
దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: వినోద్ కుమార్
సంగీతం: తమన్ ఎస్ ఎస్
సినిమాటోగ్రఫీ: డి రాజశేఖర్,
ఆర్ట్: టి. రామలింగం
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా
యాక్షన్: రవివర్మ
It’s a wrap for #Enemy shoot,all set 4 Teaser soon,so damn happy & elated 2 hv worked wit a lovely team
— Vishal (@VishalKOfficial) July 12, 2021
Tnx to @anandshank,@RDRajasekar,@MusicThaman,cast,crew,Tnx 2 producer @vinod_offl 4 making this lovely project
Love U @arya_offl so happy we are again in a fab film together pic.twitter.com/yXTqCWzIcS
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి