బాలీవుడ్ (Bollywood) తెరంగేట్రం చేయకున్నా హిందీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు పాపులారిటీకి ఏం కొదవ లేదు. అర్జున్ రెడ్డి ఇచ్చిన ఘనవిజయంతో ఈ కుర్ర హీరో పేరు దేశమంతా మార్మోగిపోయింది. విజయ్ దేవరకొండ తొలి హిందీ చిత్రం లైగర్ (Liger ) ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ సమర్పణలో పూరీ కనెక్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బీటౌన్ సర్కిల్ లో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో ధర్మ గ్రూప్ అతడితో అసోసియేట్ అవుతుంది.
కాగా ఈ అర్జున్ రెడ్డి యాక్టర్ కొంతకాలంగా తరచూ ముంబై (Mumbai)కి వెళ్లొస్తున్నాడు. అక్కడ జరిగే పార్టీలకు హాజరవుతున్నాడు. అయితే పని విషయంలో మాత్రం తన స్టైల్లో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నాడు విజయ్. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..ముంబై వేగంగా దూసుకెళ్లే ప్రపంచం. అక్కడ ప్రతీది చాలా వేగంగా జరిగిపోతుంది. అక్కడి జనాలు కూడా అంతే వేగంగా పని చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ నేను మాత్రం నా స్టైల్ లో పని చేసే లేజీ (సోమరి)హైదరాబాదీనన్నాడు.
హైదరాబాద్ జనాలు చాలా ప్రొఫెషనల్. తమ పని కోసం అన్ని రకాలుగా కష్టపడతారు.హైదరాబాద్ ఓ ప్రత్యేక మార్గంలో పనిచేస్తుంది. నాకు ముంబై అంటే ఇష్టం కానీ నేను మాత్రం హైదరాబాదీనే. కెరీర్ తొలినాళ్లలో నేను వస్తున్న దారిలో పడ్డ కష్టాలు ఎప్పటికీ మరిచిపోలేను. తరచూ ముంబైకి వెళ్లడం గురించి స్పందిస్తూ..తాను సిటీ ఆఫ్ డ్రీమ్స్ (ముంబై) కు పని మీద వెళ్లి మళ్లీ హైదరాబాద్ లోని ఇంటికి చేరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
Drugs Case: ఈడీ ఆఫీసుకి చేరుకున్న రానా..!
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్