Vijay Deverakonda | లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని తెలిసిందే. అయితే ఆ తర్వాత స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన కింగ్డమ్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ ఇక తన ఆశలన్నీ రాహల్ సంకీర్త్యన్ డైరెక్షన్లో నటిస్తోన్న VD14పైనే పెట్టుకున్నాడు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్ లాంటి సినిమాల్లో ఐకానిక్ రోల్స్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికన్ నటుడు అర్నాల్డ్ వొస్లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ- అర్నాల్డ్ వొస్లో కాంబినేషన్‌పై నెట్టింట మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ విషయంపై అసంతృప్తితో ఉన్నారన్న టాక్ జోరుగా నడుస్తోంది. ఇంతకీ దీనిక్కారణమేంటనే కదా మీ డౌటు.
గతంలో లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్, యాక్టర్ మైక్ టైసన్‌ను తీసుకోగా.. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడిక మరో పాపులర్ యాక్టర్ అర్నాల్డ్ వోస్లోను VD14లో తీసుకుంటుండటంతో మళ్లీ లైగర్ సెంటిమెంటే రిపీట్ అవుతుందా..? ఏంటీ అని ఆందోళనలో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే వరుస ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండకు మరి రాహుల్ సంకీర్త్యన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందనేది చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి.. అంటూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Karuppu | టాక్ ఆఫ్ ది టౌన్‌గా సూర్య కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్
Andhra King Taluka Review | ‘ఆంధ్రకింగ్ తాలూకా’ రివ్యూ.. రామ్ పోతినేని హిట్టు కొట్టాడా.?
Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ హిందీ వెర్షన్ ఇప్పుడు ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసా?