బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 16, 2021 , 19:22:21

ఆస్కార్‌ రేస్‌లో విద్యాబాలన్‌ ‘నట్‌ఖట్‌’

ఆస్కార్‌ రేస్‌లో విద్యాబాలన్‌ ‘నట్‌ఖట్‌’

ముంబై: ‌బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాట‌గిరిలో 2021 ఆస్కార్ అవార్డు రేసులో బాలీవుడ్ క‌థా నాయిక విద్యాబాలన్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ న‌ట్‌ఖట్ నిలిచింది. లింగ స‌మాన‌త్వం, మ‌హిళ‌ల ప‌ట్ల ద్వేషం తీరుతెన్నులను త‌న కొడుకుకు ఓ త‌ల్లి బోధిస్తున్న క‌థే ఈ సినిమాకు నేప‌థ్యం. బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2020 మూడో ఎడిష‌న్‌లో న‌ట్‌ఖ‌ట్ ఉత్త‌మ షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న‌ది. న‌టిగా విద్యాబాల‌న్‌కిది తొలి సినిమా కాదు కానీ, ఈ సినిమాతోనే ఆమె నిర్మాణ రంగంలో అరంగ్రేటం చేశారు. 

గ‌ర్వంగా ఉంద‌న్న ఆర్ఎస్‌వీపీ మూవీస్‌

బెస్ట్‌ సినిమా షార్ట్ ఫిల్మ్ క్యాట‌గిరీలో న‌ట్‌ఖ‌ట్ సినిమా.. ఆస్కార్ అవార్డు రేసులో నిల‌వ‌డం గ‌ర్వంగా ఉంద‌ని సినీ నిర్మాణ సంస్థ ఆర్ఎస్వీపీ మూవీస్ ట్వీట్ చేసింది. 

ఆర్ఎస్‌వీపీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. మేం రూపొందించిన న‌ట్‌ఖ‌ట్ షార్ట్ ఫిల్మ్  ఇంటి నుంచే మార్పు ప్రారంభం అవుతుంద‌ని ఇచ్చిన సందేశాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌లుమూల‌ల‌కు వెళ్లింది. షార్ట్ ఫిల్మ్ క్యాట‌గిరీలో ఆస్కార్‌-2021 అవార్డు కోసం త‌మ సినిమా పోటీలో ఉండ‌టం గ‌ర్వంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. 

అంత‌ర్జాతీయ గుర్తింపు ఒక న‌టిగా విలువైంద‌న్న విద్యాబాల‌న్‌

ఆస్కార్ రేసులో త‌మ సినిమా న‌ట్‌ఖ‌ట్ నిల‌వ‌డంపై విద్యాబాల‌న్ స్పందిస్తూ.. ఇది ఒక గుర్తింపు, ఒక ధ్రువీక‌ర‌ణ‌. మ‌నం చేసిన ప‌నికి ల‌భించే ప్ర‌శంస ఎంతో విలువైన‌ది. ఎల్ల‌వేళ‌లా నేను చేసిన ప‌నికి ఇది లిట్మ‌స్ టెస్ట్ వంటిది. జాతీయంగా గానీ, అంత‌ర్జాతీయంగా గానీ, విశ్వ‌జ‌నీయంగా గానీ గుర్తింపు ల‌భించ‌డం చాలా ముఖ్య‌మైంది. ఒక క‌ళాకారిణికి మ‌రింత విలువైందని పేర్కొన్నారు. న‌ట్‌ఖ‌ట్‌తోపాటు కైత్ గోమ్స్ సార‌థ్యంలోని షేమ్‌లెస్‌, తుషార్ త్యాగికి చెందిన షేవింగ్ చింటూ సినిమాలు ఈ క్యాట‌గిరీలో పోటీ ప‌డుతున్నాయి. 

విద్యాబాల‌న్‌కు ప్రియాంక చోప్రా మ‌ద్ద‌తు

హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ట్విట్ట‌ర్ వేదిక‌గా విద్యాబాల‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. దీంతో ప్రియాంకా చోప్రాకు విద్యాబాల‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌తేడాది జూన్ రెండో తేదీన జ‌రిగిన‌ మ‌న‌మంతా ఒక‌టే: ఏ గ్లోబ‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ సినిమాను యూ ట్యూబ్ ప్ర‌సారం చేసింది. లింగ స‌మాన‌త్వంపై ప్ర‌పంచ మాన‌వాళికి న‌ట్‌ఖ‌ట్ గ‌ట్టి సందేశాన్నిచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo