Veena kapoor | ప్రముఖ హిందీ సీరియల్ నటి వీణాకపూర్ ( 74 ) దారుణ హత్యకు గురైంది. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్‌బాల్ బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఇంట్లో పనిచేసే వ్యక్తి సాయంతో డెడ్ బాడీని దగ్గరలో ఉన్న నదిలో పడేశాడు. తాజాగా ఈ విషయం బయటపడటం సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హిందీ సీరియల్ నటి వీణాకపూర్ ముంబైలోని జూహూ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమె ఉంటున్న ఫ్లాట్ విలువ దాదాపు 12 కోట్ల వరకు ఉంటుంది. దీని విషయంలో ఆమె రెండో కుమారుడు సచిన్‌తో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒకరోజు వీణాకపూర్తో గొడవపడ్డ అతను.. ఆమెను బేస్‌బాల్ బ్యాట్‌తో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అనంతరం తమ దగ్గర పనిచేసే లాలాకుమార్ మండల్ సాయంతో డెడ్ బాడీని రాయ్‌గఢ్ జిల్లా మధేరా దగ్గర ఉన్న నదిలో పారేశాడు. అయితే కొద్దిరోజులుగా వీణాకపూర్ కనిపించకపోవడంతో అపార్ట్మెంట్ వాసులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వీణాకపూర్ అపార్ట్‌మెంట్‌ను పరిశీలించిన పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు. కన్నకొడుకే వీణాకపూర్ను హత్య చేసినట్టు నిర్ధారించుకున్నారు. సచిన్‌తో పాటు అతనికి సాయం చేసిన లాలాకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాల్ ది గ్యాంగ్, బంధన్ ఫేరోన్ కే వంటి సీరియల్స్‌లో నటించి వీణాకపూర్ గుర్తింపు తెచ్చుకుంది.
Avatar 2 runtime | అమ్మో ! అవతార్ 2 మూవీ రన్ టైమ్ మరీ అంత ఎక్కువా?
Saiyami Kher | నన్ను చాలా హేళన చేసేవాళ్లు.. బాడీ షేమింగ్ కామెంట్స్‌పై ఓపెన్ అయిన సయామీ ఖేర్