Avatar 2 runtime | అమ్మో ! అవతార్ 2 మూవీ రన్ టైమ్ మరీ అంత ఎక్కువా?
avatar 2 runtime | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? నీటిలో పండర గ్రహ వాసుల విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలని ఉర్రూతలూగిపోతున్నారు.
avatar 2 runtime | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? నీటిలో పండర గ్రహ వాసుల విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలని ఉర్రూతలూగిపోతున్నారు. భారత్‌లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన చాలా అన్ని చోట్ల కూడా చాలా వరకు టికెట్లు అమ్ముడుపోయాయంటే దీని క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్ కానుకగా మరో వారం రోజుల్లో అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.
అదేంటంటే.. అవతార్ 2 సినిమా రన్ టైమ్. ఈ సినిమా రన్ టైమ్ 192 నిమిషాల 10 సెకన్లు ఉందంట. అంటే మూడు గంటలకు పైగానే ఉందన్నమాట. 2009లో వచ్చిన అవతార్ ఫస్ట్ పార్ట్ రన్ టైమ్ విషయానికొస్తే 162 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 42 నిమిషాలు మాత్రమే. కానీ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్ నిడివి మరో అరగంట పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలు రావడమే తగ్గిపోయాయి. సరైన స్టోరీ.. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నప్పుడు మాత్రమే ప్రేక్షకులను సీట్లల్లో కూర్చొబెట్టగలుగుతున్నాయి. లేదంటే సినిమాలు బెడిసికొడుతున్నాయి. మరి జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌గా వస్తున్న అవతార్ 2 సినిమా ప్రేక్షకులను అంతసేపు థియేటర్లలో కూర్చోబెడుతుందో లేదో చూడాలి.
Read More :
Saiyami Kher | నన్ను చాలా హేళన చేసేవాళ్లు.. బాడీ షేమింగ్ కామెంట్స్‌పై ఓపెన్ అయిన సయామీ ఖేర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

