Jr.Ntr Going To Vacation | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో తారక్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈయన నటనకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివతో రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరు కలిసి చేయనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు చిత్రబృందం రిలీజ్ చేసిన డైలాగ్ వీడియో సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ లోపు తారక్, తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేశాడు. ఓ వారం రోజుల పాటు అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. ఈ మేరకు భార్య, పిల్లలతో కలిసి వేకేషన్‌కు పయనమయ్యాడు. తాజాగా ఆయన ఏయిర్‌పోర్ట్‌లో తన ఫ్యామిలీతో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తారక్ తన భార్య ప్రణతి, కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు.
కొరటాల శివ ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మార్పులు చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఇటీవలే అనురుధ్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా వేశాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#jrntr and his family heading to #usa for a much needed break ❤️!@jrntr
.
.
.#ntr #ntrfans #ntr30 #jrntr #ntrjr pic.twitter.com/Sq03Ft746x— SIIMA (@siima) December 10, 2022