జైనూరు: మండలంలోని మార్లవాయిలో ఐసీటీలో విధులు నిర్వహిస్తున్న గేడం లక్ష్మి (Laxmi)ఇన్స్ట్రక్టర్ కంప్యూటర్ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పవర్ గూడ యువ చైతన్యం యుత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గేడం భారత్ గేడం బాలే రావు ఆమెను సన్మానించారు. నేటి సమాజానికి, కంప్యూటర్ విద్య అత్యవసరమైన విద్య అని, ఎంతో కష్టపడి గిరిజన యువతి కంప్యూటర్ విద్య నేర్చుకొని మార్లవాయి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించడం ఆదివాసి సమాజానికి గర్వకారణమని హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పటేల్ దేవారిలు, మహిళలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.