Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ.. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా జాన్వీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల మాల్దీవ్స్‌కు వెళ్లిన ఈ బీటౌన్ సుందరి.. అక్కడ సాగర తీరంలో సేద తీరుతోంది. సముద్రంలో రైడ్ చేస్తూ నేచర్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.