Saiyami Kher | నన్ను చాలా హేళన చేసేవాళ్లు.. బాడీ షేమింగ్ కామెంట్స్‌పై ఓపెన్ అయిన సయామీ ఖేర్
Saiyami Kher | రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సయామీ ఖేర్. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాఫ్ కావడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది.
Saiyami Kher | రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సయామీ ఖేర్. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాఫ్ కావడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన మీర్జా సినిమాతో అక్కడ పాగా వేయాలని చూసింది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో హిందీలో అడపాదడపా సినిమాలు చేసిన ఈ నాసిక్ భామ.. తెలుగులో వైల్డ్ డాగ్, హైవే వంటి తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. తాజాగా ఫాదూ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కెరీర్ మొదట్నుంచి తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, బాడీ షేమింగ్ విమర్శల గురించి చెప్పుకొచ్చింది సయామీ ఖేర్.
తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది తనను హేళన చేసేవారని.. తన స్కిన్ గురించి అసభ్యంగా మాట్లాడేవారని బయటపెట్టింది సయామీ ఖేర్. లిప్ జాబ్, నోస్ జాబ్ చేయించుకోవాలని కూడా వెటకారంగా మాట్లాడేవారిని తెలిపింది. అయితే వాటన్నింటినీ పట్టించుకోలేదని చెప్పింది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరికైనా సరే బాధగానే ఉంటుందని పేర్కొంది. సమాజంలో చాలామంది సెన్సెటివ్‌గా ఉంటారని.. అందుకే ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఇక నెపోటిజం గురించి కూడా తన అభిప్రాయాన్ని సయామీ ఖేర్ చెప్పుకొచ్చింది.
స్టార్ కిడ్స్ అంటే చాలామందికి వ్యతిరేకత ఉంటుంది. కానీ ఎవరి ఇబ్బందులు వాళ్లకు ఉంటాయని తెలిపింది సయామీ. ” స్టార్ కిడ్ హర్షవర్దన్‌తో కలిసి బాలీవుడ్లో నా డెబ్యూ చేశా. కాబట్టి స్టార్ కిడ్స్ పడే బాధలు నాకు తెలుసు. వాళ్లను ఈజీగా జడ్జ్ చేసేస్తారు. సోషల్ మీడియాలో అతని గురించి అసహ్యంగా మాట్లాడుతుంటారు. మాలాంటి వాళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడాల్సి వస్తుంది. కానీ వాళ్లు పడే ఇబ్బందులు మాకంటే ఎక్కువే ఉంటాయి. ఆడియన్స్ అంచనాలను అందుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది ” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
Read More :
Sara Ali Khan | ముంబయి లోకల్ ట్రైన్లో సారా అలీఖాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

